- మేడారం జాతారకు సిద్ధం అవుతున్న తెలంగాణ..
- ఈ సారి మేడారం జాతరకు భారీగా నిదుల విడుదల..
- జాతరకు 5 నెలల ముందే నిధుల విడుదల చేసిన రేవంత్ సర్కర్..
- వచ్చే ఏడాది జనవరి 28 నుంచి 31 వరకు జాతర..
- అమ్మల జాతరకు 150 కోట్లు..
- 150 కోట్లు మంజూరు చేసిన కాంగ్రెస్ సర్కర్
- 2024 జాతర కంటే రూ. 45 కోట్లు అధికం..
- కోటిన్నరకు పైగా భక్తులు వస్తారని అంచనా..
- ఉత్తర్వులు జారీ చేసిన గిరిజన సంక్షేమ శాఖ
- జాతరను మరింత గొప్పగా నిర్వహిస్తామన్న మంత్రి సీతక్క
మేడారం ప్రపంచంలోనే అతి పెద్ద గిరిజన జాతర (Tribal Festival) . తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఈ మేడారం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక తెలంగాణ వాళ్లు అయితే ప్రతి ఇంటిం నుంచి ఒక్కరైనా ఆ మేడారం కు వెళ్లి మొక్కులు తీర్చుకోవాల్సిందే. దీంతో ఇక మేడారం కు ఇప్పటి నుంచే సందడి మొదలైంది.
ఇక విషయంలోకి వెళ్తే..
తెలంగాణలో జరిగే అతిపెద్ద గిరిజన జాతర అయిన సమ్మక్క సారలమ్మ (Sammakka Saralamma) మహా జాతర నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేసింది. జాతరకు ఐదు నెలల ముందే భారీగా నిధులు విడుదల చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. 2026లో జరగనున్న మేడారం జాతర ఏర్పాట్ల కోసం రూ. 150 కోట్లను మంజూరు చేస్తున్నట్లు ప్రకటించింది. గిరిజనుల ఆధ్యాత్మిక కుంభమేళా గా (Spiritual Kumbh Mela) పిలిచే ఈ మహోత్సవం విజయవంతంగా చేసేందుకు కీలక అడుగు పడింది. ఈ మేరకు గిరిజన సంక్షేమ శాఖ నిధులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు విడుదల చేసింది.
ఎన్నడూ లేని రీతిలో మేడారం జాతర..
ములుగు జిల్లా (Mulugu District) తాడ్వాయి మండలంలోని మేడారంలో వచ్చే ఏడాది జనవరి 28 నుంచి 31వ తేదీ వరకు ఈ మహా జాతర జరగనుంది. ఈ జాతరకు సుమారు కోటిన్నర మందికి పైగా భక్తులు హాజరవుతారని అధికారులు అంచనా వేస్తున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేసేందుకు ప్రభుత్వం ఇప్పటి నుంచే చర్యలు ప్రారంభించింది. వచ్చే ఏడాది జనవరిలో నిర్వహించబోయే మేడారం మహా జాతర ఎన్నడూ లేని రీతిలో వైభవోపేతంగా జరగనుందని అధికారులు వెల్లడించారు. ఈ సందర్భంగా మంజూరు చేసిన నిధుల పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Chief Minister Revanth Reddy), డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క (Mallu Bhatti Vikramarka),గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరు లక్ష్మణ్ కుమార్ లకు పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ది, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క (Minister Seethakka) కృతజ్ఞతలు తెలిపారు. మంత్రి సీతక్క మాట్లాడుతూ “ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఆదివాసీల గౌరవానికి ప్రతీక. మేడారం మహా జాతర కోసం రూ. 150 కోట్లు మంజూరు చేయడం, ఆదివాసీ గిరిజనుల పట్ల సీఎం రేవంత్ రెడ్డి, ప్రజా ప్రభుత్వం చిత్తశుద్దికి నిదర్శనం. ఈ సారి జాతర మరింత గొప్పగా, చారిత్రాత్మకంగా జరుగనుంది” అని పేర్కొన్నారు.
గతం కన్న ఈ సారి రూ. 45 కోట్లు ఎక్కువ..!
గతంలో 2024 జాతర కోసం కేటాయించిన నిధుల కంటే ఈసారి అదనంగా రూ. 45 కోట్లు పెంచడం విశేషం. అంతేకాకుండా, సాధారణంగా జాతరకు కొన్ని రోజుల ముందు నిధులు విడుదల చేసే పద్ధతికి భిన్నంగా, ఈసారి ఐదు నెలల ముందుగానే నిధులను విడుదల చేయడంపై భక్తులు, స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ ముందస్తు చర్యల వల్ల అభివృద్ధి పనులు నాణ్యతతో, సకాలంలో పూర్తవుతాయని వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.