- ధర్మస్థలి కేసులో 15 శవాల గుర్తింపు..
- ధర్మస్థలి లో బయటపడుతున్న శవాలు
- ఏ క్షణమైనా ధర్మస్థలి శవాల వెలికితీత
- ధర్మస్థలిలో నిగూఢంగా.. నిర్జీవ శవాలు
- దాదాపు మూడు దశాబ్దాలుగా మట్టిలో కూరుకుపోయి, కూలిపోయిన బాడీలు
- రోజు రోజుకు వీడుతున్న ధర్మస్థల గుట్టు
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కర్ణాటకలోని (Karnataka) ధర్మస్థలి (Dharamsthala) సామూహిక ఖననాల కేసులో ఆసక్తికర వాస్తవాలు వెలుగు చూస్తున్నాయి. ధర్మస్థల మాజీ పారిశుద్ధ్య కార్మికుడు (Former sanitation worker) ఒకరు తాను ధర్మస్థల పరిసరాల్లో వందలాది శవాలకు అంత్యక్రియలు నిర్వహించానని, ఈ నెల నాలుగున ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ ఫిర్యాదుపై రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రత్యేక విచారణ బృందం (ఎస్ఐటీ) (SIT) ని ఏర్పాటు చేసింది కూడా. ఈ నేపథ్యంలో.. ఫిర్యాదుదారు తాజాగా తాను శవాలను కాల్చిన, పూడ్చిన 15 ప్రాంతాలను విచారణ అధికారులకు చూపించారు.
100కు పైగా పాతిపెట్టిన శవాలు..?
ఏవైతే 100కు పైగా శవాలను పాతి పెట్టానంటూ ధర్మస్థలిలో పని చేసిన మాజీ పారిశుద్య కార్మికుడు చెప్పాడో ఆ ప్రాంతాన్ని నిన్న సిట్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం (Investigation Team) ఉందో ఆ టీం నిన్న పర్యటించింది. ఇప్పటి వరకు మొత్తం ధర్మస్థలి క్షేత్రం చుట్టూ 15 ప్రాంతాల్లో తాను ఈ డెడ్ బాడీస్ (Dead bodies) ని పాతి పెట్టారని చెబుతున్నారు. ఆ పారిశుద్ధ్య కార్మికులు గుర్తించిన ప్రదేశాలు.. సిట్ అధికారులు 1 నుంచి 15 వరకు అంకెళ్లు వేసి మార్క్ చేశారు. దీంతో పోలీసులు ఆ 15 ప్రదేశాలను తవ్వేందుకు సిద్ధం అయ్యారు.
15 ప్రాంతాలు గుర్తింపు…
ఆ వ్యక్తి ఆ 15 ప్రాంతాలను ఎక్కడెక్కడ గుర్తించారంటే.. ఒక ధర్మస్థలిలోని నేత్రావతి నది (Netravati River) పరివాహక ప్రాంతాంలో 15 శవాలను, స్నానాల ఘట్టాల వద్ద 4 శవాలు, ధర్మస్థలి హైవే పక్కన మరో 4 శవాలు, అజికూరికి వెళ్ళే హైవేలో 15 శవాల్లో 13వ శవంగా మార్క్ చేశారు. ఇక కన్వాడి అనే ఏరియాలో.. మరో రెండు డెడ్ బాడీస్ పాతి పెట్టినట్లు చెప్పుకొచ్చారు. కాగా ఇందులో ఇప్పటి వరకు 15 శవాలు మాత్రమే పోలీసులు మార్క్ చేశారు. దీంతో ఆయా ప్రాంతాల్లో ఎలాంటి ఇతర కార్యకలాపాలు జరక్కుండా సిట్ అధికారులు వాటికి జియో ట్యాగింగ్ చేశారు. అంతేకాకుండా ఫొటోలు తీసి కాపలా కోసం సాయుధ పోలీసులను ఏర్పాటు చేశారు. ఇక ఈ పారిశుద్య కార్మికుడి ఫేస్ ఎవరికి తెలియ కూడదని కోర్డు ఆదేశాలతో.. అతడి మొహానికి ప్రత్యేకంగా మాస్క్ తయారు చేయించారు. ఆ మాస్క్ పైన రెడ్ అండ్ లైన్స్ కొన్ని ఉన్నాయి. ఆ రెడ్ అండ్ వైట్ తో అతని మాస్క్ ని గ్రాఫిక్స్ తీయడం గానీ, AI లో తీయటం గానీ సాధ్యం కాకుండా ఉండేందుకే ఈ రకంగా టెక్నాలజీతో తయారు చేసినట్లు తెలుస్తుంది.
1998 -2014 కాలంలో పాతిన మృతదేహాలు..
1998 -2014 మధ్య కాలంలో తాను కొందరి ఒత్తిడి కారణంగా వందలాది మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించానని, వీరిలో చాలామంది మహిళలు, మైనర్ బాలికలు ఉన్నారని మాజీ పారిశుద్ధ్య కార్మికుడు తన ఫిర్యాదులో పేర్కొన్న విషయం తెలిసింది. జూలై నాలుగున ఫిర్యాదు ఇచ్చిన సందర్భంగా అతడు ఒక పుర్రెను సాక్ష్యంగా అందించారు. దీనిపై కర్ణాటక ప్రభుత్వం జూలై 19న డీజీపీ (DGP) ప్రణబ్ మహంతి (Pranab Mahanty) నేతృత్వంలో ఒక ఎస్ఐటీని ఏర్పాటు చేసింది. సిట్ అధికారులు తరువాత ఫిర్యాదుదారుణ్ణి రెండు రోజుల పాటు మంగళూరులో ప్రశ్నించారు. దర్యాప్తు అధికారి జితేంద్ర కుమార్ దయామా ఆ వివరాలను రికార్డు చేశారు. ఆ తరువాత సోమవారం ఫిర్యాదుదారుడితో కలిసి ఆన్సైట్ పరిశీలనలను జరిపింది. మొత్తం 15 అనుమానిత ప్రాంతాలను గుర్తించింది. ఈ కార్యకలాపాల్లో ఫోరెన్సిక్స్, ఆంత్రోపాలజీ, రెవెన్యూ విభాగాల నిపుణులు పాల్గొన్నారు. ఈ ప్రాంతాల్లో త్వరలో తవ్వకాలు జరిపేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.
మరోవైపు ఈ దర్యాప్తును ధర్మస్థళ మంజునాథేశ్వర ఆలయం స్వాగతించింది. విచారణ పారదర్శకంగా జరగాలని కోరింది. ప్రజా ప్రయోజనాల కోసం కృషి చేస్తున్న న్యాయవాదులు, స్వచ్ఛంద సంస్థల కార్యకర్తలు కొందరు ఎస్ఐటీ విచారణపై న్యాయ వ్యవస్థ పర్యవేక్షణ అవసరమని కోరారు. అలాగే నిస్పక్షికత కోసం ఫోరెన్సిక్స్ సాయం తీసుకోవాలని సూచించారు.